
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 12 సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే.. కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. అయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రీతూ వర్మ. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో బాలనటిగా కనిపించింది. ఇందులో కాజల్ చెల్లి పాత్రలో నటించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయినప్పటికీ ఆఫర్స్ మాత్రం తగ్గలేదు.

ఈ బ్యూటీకి ఎక్కువగా హిట్స్ రాకపోయినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గలేదు. తెలుగులో మొత్తం 12 సినిమాలు చేస్తే మూడు, నాలుగు మాత్రమే హిట్టయ్యాయి. ఇటీవల వచ్చిన మజాకా సినిమాక మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

అలాగే ఇన్నాళ్లు సినిమాల్లో పద్దతిగా కనిపించిన రీతూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే గ్లామర్ రచ్చ చేస్తుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. నెట్టింట గ్లామర్ షోతో కేక పెట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.