
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ మూవీ కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

74 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు రజినీ. అటు సినిమాలు.. ఇటు ఫిట్నెస్ విషయంలో అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తున్నారు. అయితే ఈ వయసులోనూ రజినీ ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. ?

రజనీకాంత్ రోజు యోగా, ప్రకృతితో ప్రారంభమవుతుంది. ఉదయం సమయాన్ని పూర్తిగా తనకోసమే కేటాయిస్తాడు. ఉదయం లేచి యోగా, ధ్యానం, ప్రకృతి మధ్య కాసేపు నడుస్తాడు. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా తన మనసు ప్రశాంతంగా ఉంటుందట.

వ్యాయమాలు, నడకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ వయసులోనూ ఫిట్నెస్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంట్లో తయారు చేసిన భోజనం మాత్రమే తీసుకుంటారు. కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, తృణధాన్యాలు తీసుకుంటారు. అలాగే చక్కెర, అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటారు.

ఈ ప్రక్రియ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. రజినీ మద్యం, సిగరెట్స్ అస్సలు ముట్టుకోరు. మంచి ఆరోగ్యం కేవలం శరీరానికి సంబంధించినది కాదని, మనస్సు, సంబంధాలకు కూడా సంబంధించినదని ఆయన నమ్ముతాడు.