
టాలీవుడ్ నటి సమంతపై అభిమానంతో తన ఇంట్లోనే గుడి కట్టించాడు ఓ వీరాభిమాన్. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన సందీప్. అయితే సామ్‌కే కాదు.. గతంలోనూ మరికొందరు హీరోయిన్లకు కూడా గుళ్లు కట్టారు కొందరు ఫ్యాన్స్.

90 వ దశకంలో దక్షిణాదిన ఓ వెలుగు వెలిగారు ఖుష్బూ. తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును కట్టిపడేశారామె. అందుకే తమిళనాడు తిరుచిరాపల్లిలో ఖుష్బూకు ఓ కోవెల కట్టించారు.

సొంతం, జెమిని, సింహా తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది నమిత. ఈమెకు తమిళనాట బోలెడు అభిమానులున్నారు. అందుకే కోయంబత్తూర్, తిరనవెల్లితో పాటు మరో మూడు చోట్ల నమితకు గుడి కట్టారు ఫ్యాన్స్.

Hansika

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చెన్నై శివారులో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టించారు ఫ్యాన్స్.

90 వదశకంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందింది నగ్మా. ఈక్రమంలో ఆమె అందం, అభినయానికి ఫిదా అయిన ఫ్యాన్స్ తమిళనాడులో పలు చోట్ల గుడులు కట్టించారు. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి.

వీరితో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార, కాజల్ అగర్వాల్‌కు విగ్రహాలు ఏర్పాటుచేసి గుళ్లు కట్టాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. అయితే ఈ అందాల భామలు వారించడంతో ఫ్యాన్స్ వెనక్కు తగ్గారు.