
రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత కిరణ్ చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. సెబాస్టియన్ పీసీ 524, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు నిరాశపర్చాయి.

అయితే విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ యంగ్ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే అప్పుడప్పుడు ప్రేమ, రిలేషన్ షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు కిరణ్ అబ్బవరం.

తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో కిరణ్ ప్రేమలో ఉన్నాడంటూ అప్పుడప్పుడూ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు కూడా వైరలయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ వ్యవహారంపై స్పందించాడు కిరణ్.

రహస్య గోరఖ్ తో ప్రేమలో ఉన్నారా? త్వరలోనే పెళ్లి డేట్ చెబుతారా? అన్న ప్రశ్నకు బాగా సిగ్గు పడిపోయాడు కిరణ్. గతంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇంతలా దొరికిపోలేదన్నాడు. ఈ మాటలతో వీరిద్దరూ నిజంగానే లవ్‌లో ఉన్నట్లేనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.