టాలీవుడ్‌లో పెళ్లి పీటలెక్కబోతున్న మరో ప్రేమజంట.. పెళ్లి ఎప్పుడంటే ??

| Edited By: Phani CH

Mar 13, 2024 | 12:33 PM

కలిసి నటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ నటించే సమయంలోనే వాళ్ల మనసులు కలుస్తున్నాయి. రీల్‌పై లవ్ స్టోరీ నడిపిస్తున్నాం అనే భ్రమలోనే రియల్ లైఫ్‌లోనూ ప్రేమకథలు నడిపిస్తున్నారు వాళ్లు. టాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఎవరా జంట..? వాళ్ల పెళ్లెప్పుడు..? టాలీవుడ్ లవ్ స్టోరీస్‌పై స్పెషల్ స్టోరీ.. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. కెరీర్ మొదట్లో నటించిన హీరోయిన్లనే పెళ్లి చేసుకుంటున్నారు మన హీరోలు.

1 / 5
కలిసి నటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ నటించే సమయంలోనే వాళ్ల మనసులు కలుస్తున్నాయి. రీల్‌పై లవ్ స్టోరీ నడిపిస్తున్నాం అనే భ్రమలోనే రియల్ లైఫ్‌లోనూ ప్రేమకథలు నడిపిస్తున్నారు వాళ్లు. టాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఎవరా జంట..? వాళ్ల పెళ్లెప్పుడు..? టాలీవుడ్ లవ్ స్టోరీస్‌పై స్పెషల్ స్టోరీ..

2 / 5
తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. కెరీర్ మొదట్లో నటించిన హీరోయిన్లనే పెళ్లి చేసుకుంటున్నారు మన హీరోలు. ఎప్పుడో నాగార్జున, మహేష్ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నాగ చైతన్య, వరుణ్ తేజ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా కిరణ్ అబ్బవరం సైతం మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరక్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు.

3 / 5
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్, రహస్య నిశ్చితార్థం మార్చి 13న జరగనుంది. పెళ్లి తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. 2019లో ‘రాజావారు రాణిగారు’లో కలిసి నటించారు ఈ జోడీ. అప్పట్నుంచి ప్రేమలో ఉన్నారు. ఇక కిరణ్ కంటే ముందు.. వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్నారు. మిస్టర్, అంతరిక్షంలో కలిసి నటించారు ఈ జోడీ.

4 / 5
నాగ చైతన్య, సమంత కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఏ మాయ చేసావే టైమ్ నుంచి ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. నాలుగేళ్ళ వైవాహిక బంధం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అలాగే పవన్ కూడా కెరీర్ కొత్తలో బద్రి, జానీలో తనతో నటించిన రేణు దేశాయ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరు కూడా విడిపోయారు.

5 / 5
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సైతం ప్రేమ పెళ్లే చేసుకున్నారు. ఇండస్ట్రీలో లవ్ బర్డ్స్ అంటే ఈ ఇద్దరి పేర్లే గుర్తుకొస్తాయి. అంత అన్యోన్యంగా ఉన్నారు మహేష్, నమ్రత. అలాగే నాగార్జున, అమల.. శ్రీకాంత్, ఊహ.. జీవిత, రాజశేఖర్‌లది ప్రేమ వివాహమే. మొత్తానికి ఇదే ట్రెండ్ ఇప్పుడు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ కూడా కొనసాగిస్తున్నారు.