Salaar: సలార్ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు శ్రుతి హాసన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీకి ఐదు భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు శ్రుతి. మూడు రోజుల్లోనే మూడు భాషల డబ్బింగ్ వర్క్ పూర్తి చేసినట్టుగా వెల్లడించారు.
Sudeep: లాంగ్ బ్రేక్ తీసుకున్న కిచ్చా సుదీప్, నెక్ట్స్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న 46వ సినిమా కోసం భారీ వర్కవుట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్ ఫైట్ కోసం సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో సిద్ధమవుతున్నారు సుదీప్. ఈ సినిమాను తమిళ నిర్మాత కలైపులి యస్ థాను వి క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
Don 3: డాన్ త్రీక్వెల్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. రణవీర్ సింగ్ హీరోగా డాన్ 3ని రూపొందించబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్. గతంలో డాన్ క్యారెక్టర్‌లో నటించిన అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్‌ను ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.
Malaika Arora: చాలా రోజులుగా డేటింగ్‌లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారన్న వార్తలు వైరల్ అయ్యాయి. కొద్ది రోజులుగా ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు బయటకు రాకపోవటం... అర్జున్, మలైకా కూడా కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయకపోవటంతో ఈ అనుమానాలు కలిగాయి. తాజాగా ఇద్దరు కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీడియో బయటకు రావటంతో రూమర్స్‌కు చెక్ పడింది.
Fighter: హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఏరియల్ యాక్షన్ మూవీ ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైంది. హృతిక్, అనిల్ కపూర్‌ల మీద క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తరువాత భారీ సెట్‌లో సాంగ్ షూట్ ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.