
రీసెంట్‌గా ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ, కెరీర్ విషయంలో మాత్రం బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు. తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ స్క్రీన్ మీద ఐకానిక్ గ్లామరస్ రోల్‌కు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ.

రీసెంట్‌గా సత్యప్రేమ్‌కి కథ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కియారా. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో నటించిన కియారా మీద ట్రోల్స్ కూడా గట్టిగానే వైరల్ అయ్యాయి. దీంతో సినిమా సక్సెస్‌ను అంతగా ఎంజాయ్ చేయలేకపోయారట ఈ బ్యూటీ.

పెళ్లి తరువాత మరో యంగ్ హీరోతో లిప్ లాక్ చేయటం గురించి కియారాను టార్గెట్ చేశారు నెటిజెన్స్. అయితే గ్లామర్ వరల్డ్‌లో ఇలాంటివన్నీ కామన్ అంటున్నారు ఈ క్రేజీ బ్యూటీ. అందుకే ఇప్పుడు మరో అల్ట్రా గ్లామరస్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హాలీవుడ్‌లో బాండ్ గర్ల్స్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో... బాలీవుడ్‌లో డాన్ హీరోయిన్లకు కూడా అదే రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. సౌత్‌లోనూ బిల్లా హీరోయిన్స్ అదే రేంజ్‌లో గ్లామర్ షో చేశారు. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే మూవీస్ కావటంతో ఆ రేంజ్‌లోనే హీరోయిన్స్ లుక్స్ ప్లాన్స్ చేస్తుంటారు మేకర్స్.

ఇప్పుడు డాన్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు కియారా. రీసెంట్‌గా డాన్ 3ని అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేసిన మేకర్స్, ఈ సారి రణవీర్ సింగ్ డాన్‌గా కనిపించబోతున్నారని వెల్లడించారు. ఈ సినిమాలో డాన్‌కు జోడిగా కియారాను ఫైనల్ చేశారు డైరెక్టర్ ఫర్హాన్. ఈ న్యూస్‌తో మరోసారి కియారా గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ చూపించబోతున్నారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.