
ప్రజెంట్ నార్త్ స్టార్స్ అంతా సౌత్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ మన హీరోలతో మింగిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ రావాలంటే టాలీవుడ్‌తో టచ్‌లో ఉండాల్సిందే అని గట్టిగా నమ్ముతున్నారు.

ఈ ఈక్వెషన్‌ను డీకోడ్ చేసిన ఇద్దరు బ్యూటీస్.. ఇద్దరు టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్.

ఈ బ్యూటీ తెరంగేట్రం చేసిన దగ్గర నుంచే సౌత్ ఎంట్రీ విషయంలో చర్చ జరుగుతోంది. లాంగ్ వెయిటింగ్ తరువాత టాలీవుడ్‌లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ కపూర్.

అంతకన్నా ముందు.. ప్రీతీ కేరక్టర్ కోసం వెళ్లి కలిశారట.. తెలుగులో సెన్సేషనల్ మూవీగా పేరు తెచ్చుకున్న అర్జున్‌రెడ్డిని బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించారు సందీప్.

ఆల్రెడీ సౌత్ సినిమాతో టచ్‌లోనే ఉన్న కియారా కూడా దక్షిణాది మీద ఫోకస్ పెంచారు. ప్రజెంట్ రామ్ చరణ్‌తో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, నెక్ట్స్ వార్ 2లో ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు.

సందీప్ కెప్టెన్సీలో కబీర్‌సింగ్‌లో పోగొట్టుకున్న ఛాన్స్ ని ఎప్పటికైనా అందుకోవాలన్నదే ప్రస్తుతానికి తన గోల్ అని అంటున్నారు ఈ బ్యూటీ.