Rajeev Rayala | Edited By: Ravi Kiran
Jul 16, 2022 | 8:15 AM
కేజీఎఫ్ లో రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించగా.. అతని ప్రియురాలిగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి కనిపించింది.
ఈ సూపర్ హిట్ సినిమాతో శ్రీనిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.
కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి వరుస ఆఫర్లు వచ్చాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు కోబ్రా సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది.
ఈ క్రమంలో తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీనిధి రెమ్యునరేషన్ టాక్ హాట్ టాపిక్‌గా మారింది.
కోబ్రా సినిమా కోసం శ్రీనిధి భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమా కోసం శ్రీనిధి కేజీఎఫ్ కంటే రెండింతలు ఎక్కువగా తీసుకుందట.
కేజీఎఫ్ సినిమాలో నటించినందుకు ఆమె రూ. 3 కోట్లు తీసుకుందట. ఇక ఇప్పుడు కోబ్రా మూవీ కోసం ఏకంగా ఆరు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది.