
పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచి కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. బేబీ జాన్‌లో అమ్మడి గ్లామర్ షో మామూలుగా లేదు. సినిమా ఫ్లాపైనా.. కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్‌బస్టర్.

బాలీవుడ్‌లో ఈ భామ పేరు బాగా రీ సౌండ్ వస్తుందిప్పుడు. ఊ అనాలే గానీ అక్కడ్నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి కూడా. అయితే పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు కీర్తి.

పెళ్లి తర్వాత ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సైన్ చేయని కీర్తి సురేష్.. ఇదివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భర్తతో కలిసి ఫోటోషూట్స్ చేస్తున్నారు కీర్తి.

తాజాగా కొత్త సినిమాకు సైన్ చేసారు ఈ భామ. అది కూడా సొంత భాష మలయాళంలోనే ఒప్పుకున్నారు కీర్తి. 2018 ఫేమ్ టోవినో థామస్‌తో ఈమె సినిమా చేయబోతున్నారు. అప్పుడెప్పుడో సైన్ చేసిన రివాల్వర్ రీటాతో పాటు తమిళంలో కన్నివేడి సినిమాలు చేస్తున్నారు కీర్తి.

తాజాగా టొవినోతో కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేసారు కీర్తి. ఈ విషయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు టొవినో. దాంతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా బాగానే చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌కు అక్క అనే సిరీస్ చేస్తున్నారు.