
కీర్తి సురేష్.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వచ్చిన కీర్తి.. ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. తన వెయిట్ లాస్ పై ఆసక్తికర విషయాలు పంచుకుంది.

2018 వరకు తాను ఎలాంటి వర్కౌట్స్ చేయలేదని తెలిపింది. 2018లో మహానటి సినిమా తర్వాత తాను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాని.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకున్నానని తెలిపిందే. జిమ్ , వర్కవుట్స్ తనకు సరైనవి కాదని గ్రహించానని తెలిపింది.

అందుకే తాను కార్డియోకి ప్రాధాన్యత ఇచ్చానని.. కండల పెరుగుదలకు ఎంతో సహయపడిందని చెప్పుకొచ్చింది. తాను వారానికి 5 రోజులు కచ్చితంగా వ్యాయమం చేస్తానని తెలిపింది. గత రెండు మూడు సంవత్సరాలుగా బలమైన శిక్షణ తీసుకుంటుందట.

అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకున్నానని.. అలాగే రోజుకు 6-7 గుడ్డులోని తెల్లసొన మాత్రమే తిన్నానని తెలిపిందే. పనీర్, టోఫు, సోయా, చిక్కుళ్ళు, చిక్‌పీస్ తీసుకున్నానని తెలిపింది.

అలాగే ఎక్కువగా బ్లాక్ కాఫీ, రాత్రిళ్లు చపాతీ, పన్నీ, పుట్టగొడుగులతో చేసిన తేలీకపాటి ఆహారం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే నిత్యం సూప్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.