
ఇటు గ్లామర్ చిత్రాలు... అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్... అయినా ఆశించినంత భారీ హిట్టు లేదు. ఒకవేళ ఒకటీ అరా హిట్లున్నా... అవి కూడా హీరోల ఖాతాలోనే జమవుతున్నాయి. మరి మహానటిని మించే హిట్ కీర్తీ ఖాతాలో పడేదెప్పుడు?

కీర్తీ సురేష్ పేరు చెప్పగానే అందరికీ చటుక్కున ఏం గుర్తుకొస్తుంది? మహానటి... ఆ తర్వాత.. మహానటి.. ఆ తర్వాత... మహానటి... యస్.. ఆ సినిమా తర్వాత దాన్ని బీట్ చేసే సినిమాను ఇప్పటిదాకా చేయలేదు కీర్తీ సురేష్ అన్నదే క్రిటిక్స్ మాట.

మహానటితో నటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి... జస్ట్ ఆ జోనర్‌కి మాత్రమే పరిమితం కాలేదు. తన హద్దులు దాటి గ్లామర్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేశారు.

కమర్షియల్ సినిమాలు అడపాదడపా హిట్ అయినా వాటి క్రెడిట్ మాత్రం అమ్మణికి చేరలేదు. అయినా హిట్టూ ఫ్లాపూ తన ఛాయిసెస్‌ని డిసైడ్ చేయలేవని అంటున్నారు కీర్తీ సురేష్.

కథల ఎంపిక తీరులో ఏమాత్రం మార్పు లేదన్నట్టే ఉంది ఆమె ఫిల్మోగ్రఫీని గమనిస్తే. సౌత్‌లో పక్కా లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కే సిగ్నల్ ఇస్తున్న ఈ బ్యూటీ నార్త్ లో కాస్త గ్లామర్ డోస్ పెంచి బేబీ జాన్ చేశారు. మరి అక్కడైనా బ్లాక్ బస్టర్ హిట్ పలకరిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ