
కీర్తి సురేష్ 17 అక్టోబర్ 1992న తమిళనాడులోని మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి జి. సురేష్ కుమార్ మలయాళీ మూలానికి చెందిన చిత్రనిర్మాత. ఆమె తల్లి మేనక తమిళ మూలానికి చెందిన నటి. ఆమెకు రేవతి సురేష్ అనే అక్క ఉంది.

నాల్గవ తరగతి వరకు, కీర్తి తన పాఠశాల విద్యను తమిళనాడులోని చెన్నైలో చేసింది. తర్వాత కేరళలోని పట్టంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది. ఆమె ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. లండన్‌లో రెండు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది.

2013లో నవంబర్ 14న వచ్చిన మలయాళీ హార్రర్ సినిమా గీతాంజలిలో తొలిసారి హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. ఈ చిత్రానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా పైలట్స్, అచనేయనేనికిష్టం, కుబేరన్ వంటి చిత్రాల్లో నటించింది ఈ భామ.

తెలుగులో నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత నాచురల్ స్టార్ నానికి జోడిగా నేను లోకల్ చిత్రంలో కథానాయకిగా అందం, అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత మహానటి అనే తెలుగు చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించింది. ఈ చిత్రంతో నేటితరం మహానటి అయిపొయింది. 2022లో సర్కార్ వారి పాట చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. 2023లో దసరా చిత్రంలో మొదటిసారి పూర్తి డిగ్లామర్ పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి పాన్ ఇండియా హిట్ అందుకుంది. తెలుగు సినిమాల్లో కొద్దీ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల అభిమానన్నీ సంపాదించింది.