కత్రినా కైఫ్.. ఇటీవల తన ప్రియుడు హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లికి ముందు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తోన్న క్యాట్ మళ్లీ షూటింగ్‌లలో బిజీగా మారిపోయింది.
రీల్ లైఫ్‌లోనే కాదు రియల్‌గానూ ఎంతో అందంగా ఉంటుంది కత్రినా. మిలమిలా మెరిసే చర్మం ఈ ముద్దుగుమ్మ సొంతం. కొన్నిసార్లు ఆమె వయస్సును కూడా అసలు ఊహించలేం.
కత్రినా తన చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుకోవడానికి ఓట్స్, తేనెతో చేసిన ఫేస్ ప్యాక్‌ని వినియోగిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది కాకుండా, నిద్రలేచిన వెంటనే ఐస్ వాటర్‌లో తన ముఖాన్ని ముంచుతుంది. ఇక ఫేస్ క్లీనింగ్ కోసం రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తుంది.
చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యమని కత్రినా చెబుతుంది. దీని కోసం, ఆమె మాక్రోబయోటిక్ డైట్‌ని ఫాలో అవుతుంది. ఇందులో భాగంగా బ్రౌన్ రైస్, బీన్స్, సీఫుడ్, కూరగాయలను ఎక్కువ తీసుకుంటుంది. ఇవి కాకుండా ఫైబర్ బాగా దొరికే ఫుడ్స్‌కు డైట్‌లో భాగమిస్తుంది. ఇవి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును సమతుల్యంగా ఉంచుతాయి. ఇక ప్రతి 2 గంటలకు తాజాగా ఉడికించిన కూరగాయలు, పండ్లను కూడా తింటుందట క్యాట్.
బాడీని, స్కిన్‌ను హైడ్రేట్ గా ఉంచడానికి, కత్రినా పుష్కలంగా నీరు తాగుతుంది. వీటితో పాటు తరచూ ఇతర ద్రవ పదార్థాలను తీసుకుంటుంది. ఉదయం 4 గ్లాసుల నీరు తాగడంతోనే కత్రినా దినచర్య ప్రారంభమవుతుంది. ఇలా నీరు ఎక్కువగా తాగడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుండట.