3 / 6
దీప.. హిమనీ, శౌర్యాని వారణాసి తో జాతరకు పంపిస్తుంది. అదే సమయంలో మోనిత అదే ఊరిలో తిరుగుతూ ఉంటుంది. ఓ ఆటోని పిలిచి గడియారం స్థంభం దగ్గరకు వెళదాం వస్తావా అని అడుగుతుంది. తనకు హైద్రబాద్ కలిసి రాలేదు.. ఈ ఊరు కలిసి వచ్చింది. పెళ్లి తర్వాత ఇదే ఊరిలో సెటిల్ అవుతాం.. కార్తీక్ తో పెళ్లి తర్వాత ఇదే ఊరిలో సెటిల్ అవుతాం చి. ల సౌ. మోనిత ని చిరంజీవి కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయుటకు పెద్దలు నిశ్చయించారు.. అని తనలో తానె నవ్వుకుంటుంది.. టెస్టులకు వెళ్తావా.. వేళ్ళు కార్తీక్ అని అంటు సంబర పడుతుంది.