
ఊరుకుంటే ఊరా పేరా? ఎప్పుడూ సందడి చేస్తూనే ఉండాలి. ఏదో విధంగా జనాల్లో ఉండాలి. అప్పుడే కదా.. మన మీద ఓ కాన్‌సెన్‌ట్రేషన్ ఉండేది అని ఫిక్స్ అయినట్టుంది దేవర టీమ్. అనుకున్నదే తడవుగా హంగామా మొదలుపెట్టేసింది. దేవర టీమ్‌తో చేతులు కలిపేశారు కరణ్ జోహార్ అండ్ అనిల్ తడానీ...ఇక ప్రమోషన్స్ మామూలుగా ఉంటాయా చెప్పండి...

ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ దేవర సినిమా అప్‌డేట్లు నందమూరి అభిమానుల్లో సందడి పెంచుతున్నాయి. సెలబ్రేషన్ మోడ్‌ని కంటిన్యూ చేస్తున్నాయి. దేవర సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కరణ్ జోహార్, అనిల్ తడానీ ముందుకొచ్చారు. దీంతో అక్కడ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. .

ఇంతకీ మే 9న ఉన్నట్టా? లేనట్టా అని అందరినీ ఊరిస్తున్న కల్కి సినిమా షూటింగ్ ఇప్పుడు.. శంకర్‌పల్లిలో జరుగుతోంది. శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా మణికొండ డాలర్ హిల్స్ లో జరుగుతోంది.

జనతా గ్యారేజ్ సినిమాను మించిన హిట్ ఇవ్వాలి, కెరీర్‌లో బౌన్స్ బ్యాక్ కావాలనే కసితో పనిచేస్తున్నారు కొరటాల శివ. సీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ప్యాన్ ఇండియా లెవల్లో ఇంట్రస్టింగ్ బజ్ మొదలైంది.

ఖర్చుకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మిస్తున్నారు మేకర్స్. ట్రిపుల్ ఆర్ తర్వాత.. మాన్ ఆఫ్ మాసెస్ తారక్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా కావాలన్నది ఒక్కటే ఇప్పుడు టీమ్‌లో కనిపిస్తున్న లక్ష్యం. చూస్తూ ఉండండి... అక్టోబర్ 10న హంగామా మామూలుగా ఉండదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.