
యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన కూతురు ఐశ్వర్య సైతం హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

2013లో వచ్చిన పట్టతు యానమ్ సినిమాతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది ఐశ్వర్య. ఆ తర్వాత ప్రేమ బరాహ అనే చిత్రంలో నటించారు.

ప్రస్తుతం తెలుగులో అర్జున్ సర్జా దర్శకత్వంలోనే ఐశ్వర్య నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

త్వరలోనే ఐశ్వర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. తమిళనాట సీనియర్ హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య ప్రేమలో ఉందట.

వీరి ప్రేమకు రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగబోతుందని సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఐశ్వర్య అర్జున్.. వరుడు ఎవరంటే..

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఐశ్వర్య అర్జున్.. వరుడు ఎవరంటే..