Film Updates: కంగన ఎమర్జెన్సీ మళ్లీ వాయిదా.. దీపికా బ్యాక్ టు షూట్‌..

|

Oct 18, 2024 | 3:48 PM

కంగన దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఎమర్జెన్సీ ఇంకా సమస్యలు తప్పలేదు. మరో కొత్త సినిమాను ప్రకటించిన గౌతమ్‌ తిన్ననూరి. సీనియర్‌ హీరో అర్జున్ దర్శకుడిగా సీతా పయనం మూవీ ప్రకటన. అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా  విఘ్నేష్ శివన్‌ లిక్ మూవీ అప్డేట్. తక్కువ గ్యాప్ తోనే షూటింగ్ కి దీపికా పదుకొనే. తాజా సినిమాలు అప్డేట్స్ మీ కోసం..

1 / 5
కంగన స్వయంగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ. సెన్సార్ సమస్యలతో రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఇప్పట్లో ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. సినిమా కంటెంట్‌ విషయంలో సిక్కులు అభ్యంతరం చెబుతుండటంతో, పంజాబ్ ఎలక్షన్స్ పూర్తయిన తరువాతే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

2 / 5
ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేశారు యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా రూపొందిస్తున్న గౌతమ్‌, నెక్ట్స్ యువ నటీనటులతో మ్యాజిక్‌ అనే సినిమా చేయబోతున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీమందిస్తున్నారు.

3 / 5
సీనియర్‌ హీరో అర్జున్ దర్శకుడిగా మరో మూవీ ఎనౌన్స్ చేశారు. సీతా పయనం పేరుతో సౌత్ ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో ఓ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. శ్రీ రామ్ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

4 / 5
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా లిక్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ధీమ అంటూ సాగే ఈ పాటను అనిరుధ్ స్వయంగా ఆలపించారు. విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రదీప్‌ రంగనాథన్‌, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు.

5 / 5
అమ్మ అయ్యాక నెల రోజుల్లోనే మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు దీపిక. భర్త రణవీర్‌సింగ్‌తో కలిసి ఓ టీవీ కమర్షియల్‌లో నటించారు. ఈ షూట్‌కు సంబంధించిన వీడియో తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు రణవీర్‌. దీపిక కీలక పాత్రలో నటించిన సింగం ఎగైన్‌ నవంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.