
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు ఈ భామ.

ఆతర్వాత రణరంగం, చిత్రలహరి సినిమాల్లో నటించింది కళ్యాణి. వీటిలో చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ అమ్మడు ఇప్పుడు మలయాళంలో ఫుల్ బిజీగా మారిపోయింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మొనీమధ్య హృదయం అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

మంచి ఛాన్స్ వస్తే తెలుగులో మరోసారి తన ప్రతిభ చూపాలని ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు. ఇక సోషల్ మీడియాలో ఈ ఆముద్దుగుమ్మకు మంచి డిమాండ్ ఉంది.

తన బ్యూటీఫుల్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తూ ఉంటుంది కళ్యాణి. తాజాగా ఈ భామ కొన్ని అందమైన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.