రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఎవరి నోట విన్నా ఒకటే మాట.... అబ్బబ్బబ్బబ్బా... హృదయం సినిమా ఎంత బావుంది. ఎంత నేచురల్‌గా తీశారు అని.
ఆ కాంప్లిమెంట్స్ లో చాలా వరకు కల్యాణి ప్రియదర్శన్‌కి కూడా చేరుతాయి. ఎందుకంటే సినిమా సెకండాఫ్ లో కీ రోల్ చేశారామె.
హృదయం గురించి చప్పుడు సర్దుమణగగానే మళ్లీ ప్రశంసలు పొందిన మలయాళ సినిమా బ్రో డాడీ.
పృథ్విరాజ్ పక్కన పర్ఫెక్ట్ గా సరిపోయారు కల్యాణి.
అంతకు ముందే మోహన్‌లాల్ మరక్కర్‌లోనూ కీ రోల్ చేశారు. ప్రస్తుతం మలయాళంలో తళుమాలలో యాక్ట్ చేస్తున్నారు కల్యాణి.
అయితే నటిగా ఆమె కెరీర్ స్టార్ట్ అయింది మాత్రం హలో మూవీతో.
ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం చేసినా, తనకు ఫుల్ నేమ్, ఫేమ్ తెస్తున్న మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే ఫోకస్ చేస్తున్నారు కల్యాణి.
అలాగని అదర్ లాంగ్వేజెస్‌లో బెస్ట్ రోల్స్ వస్తే చేయననడం లేదన్నది ఈ బ్యూటీ ఇస్తున్న క్లారిటి.
Kalyani Priyadarshan: సన్నజాజి పూవులాంటి సోగాయాల కళ్యాణి ప్రియదర్శన్ ..