Rajeev Rayala |
May 21, 2024 | 5:42 PM
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీలో అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది కాజల్ అగర్వాల్. బాలయ్య నడిచిన భగవంత్ కేసరి సినిమాలో నటించింది కాజల్.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సత్యభామ అనే సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది కాజల్ అగర్వాల్. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
నిజానికి కాజల్ ను స్టార్ హీరోయిన్ ను చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీనే.. టాలీవుడ్లో సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న తర్వాత తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ..
బాలీవుడ్ తో పోల్చుకుంటే టాలీవుడ్ కొంచం మారాలి అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో పెళ్ళైన హీరోయిన్స్ కు కూడా అవకాశాలు ఇస్తారు. చాలా మంది పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు.
కానీ టాలీవుడ్ లో మాత్రం అలా కాదు హీరోయిన్ కు వెళ్లిందంటే అవకాశం ఇవ్వడానికి కొంచం ఆలోచిస్తారు. ఇది మారాలి. త్వరలోనే టాలీవుడ్ లో ఆ మార్పు వస్తుందని భావిస్తున్నా అని తెలిపింది కాజల్ ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.