
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగిస్తోన్న నటీమణుల్లో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఒకరు. 2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె సుమారు 16 ఏళ్లుగా తన నటనతో అలరిస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా రీ ఎంట్రీలో అదరగొడుతోంది.

గతేడాది హే సినామికలో నటించిన కాజల్ ఈ ఏడాది ఘోస్టీ, కార్తీక సినిమాల్లో మెరిసింది. ఇందులో ఆమె పోషించిన పాత్రలకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న భగవత్ కేసరిలో హీరోయిన్‌గా నటిస్తోంది.

అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

బాలకృష్ణ సినిమాతో పాటు కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీలోనూ నటిస్తోంది కాజల్ అగర్వాల్. గతంలో శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది కాజల్. తన భర్త, పిల్లల ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. అలాగే తన గ్లామరస్ ఫొటోలను పంచుకుంటోంది. అలా కాజల్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.