యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆల్రెడీ వర్కవుట్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మా సినిమాతో పోలిస్తే, కొమరం భీముడు ట్రిపుల్ ఆర్‌లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఓ లెక్కలోనివి కూడా కాదన్నట్టే ఉంది దేవర కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న టాక్. నాన్‌స్టాప్‌గా నైట్ షెడ్యూల్స్ లో చేసిన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అనిపించేలా వస్తున్నాయన్నది వైరల్ టాక్. దానికి తోడు ఇప్పుడు గోవా, గోకర్ణలో షెడ్యూల్స్ జరుగుతున్నాయి.
జానీ మాస్టర్ దేవరలో ఓ సాంగ్‌కి డ్యాన్స్ కంపోజ్ చేస్తారనే వార్తలు కూడా అభిమానులను ఊరిస్తున్నాయి. ఎంత మాస్ మూవీ అయినా, పక్కన జాన్వీ లాంటి అమ్మాయి ఉన్నప్పుడు, తారక్ వేసే స్టెప్పులు అద్దిరిపోవాల్సిందేనని అంటున్నారు అభిమానులు. వారి అంచనాలను రీచ్ కావడానికి అన్నీ విధాలా ట్రై చేస్తున్నారు మేకర్స్. దేవర రెండు పార్టులుగా రిలీజ్ అవుతుందనే టాక్ కూడా ఆల్రెడీ స్ప్రెడ్ అవుతోంది.
జనవరి వరకు దేవర ఫస్ట్ పార్ట్ షూటింగ్‌కి కాల్షీట్ కేటాయించారట తారక్. అటు వార్ 2 ప్రోమో షూట్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్టూడియోలో ఈ షూట్ జరుగుతోంది.
హృతిక్ రోషన్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. తారక్ కూడా టైమ్ కేటాయించారని టాక్. ఈ ప్రోమో షూట్ పూర్తి కాగానే, హృతిక్ సేమ్ మూవీతో కంటిన్యూ అవుతారు. తారక్ మాత్రం ఫిబ్రవరి నుంచి వార్2 షూటింగ్‌కి హాజరవుతారని సమాచారం.