Tanishaa Mukerji: ఎత్తైన కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్.. కంత్రీ మూవీ హీరోయిన్ కామెంట్స్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తానీషా ముఖర్జీ. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. ఇక ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఏ సినిమాలోనూ ఈ బ్యూటీ కనిపించలేదు. హిందీ బిగ్ బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది తానీషా. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తానీషా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది.
Tanisha Mukerji
Follow us on
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తానీషా ముఖర్జీ. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. ఇక ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఏ సినిమాలోనూ ఈ బ్యూటీ కనిపించలేదు. హిందీ బిగ్ బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది తానీషా.
కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తానీషా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. తాజాగా ఓఇంటర్వ్యలో పాల్గొన్న ఆమె ఆసక్తిక విషయాలను బయటపెట్టింది.
తన మొదటి సినిమా ష్ అని.. ఆ మూవీ షూటింగ్ ఎత్తైన కొండపైన చేశారని తెలిపింది. అదే సమయంలో ఆ కొండ పైనుంచి కిందపడిపోయానని.. దీంతో తలకు బలమైన గాయమైందని చెప్పుకొచ్చింది. కిందపడడంతో మెదడు డ్యామేజ్ అయ్యిందని తెలిపింది.
దీంతో రెగ్యులర్ గా ఆసుపత్రికి వెళ్తూ ఏడాదిపాటు ట్రీట్మెంట్ తీసుకున్నానని.. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి తనకు ఒక సంవత్సరం పట్టిందని తెలిపింది. తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదని.. మొదటి సినిమా కావడంతో ఎక్కడ తీసేస్తారోనన్న భయంతో ఉన్నట్లు తెలిపింది.
మెదడు డ్యామేజ్ అయినా దానిని పెద్ద సమస్యగా ఎప్పుడూ చూపించలేదని.. గాయంతో బాధపడుతునే షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిపింది. రెండు గంటలు షూటింగ్ జరిగితే మూడు గంటలు నిద్రపోయేదాన్ని అని.. మెదడుకు గాయం కావడంతో ఎక్కువసేపు యాక్టివ్ గా ఉండేదాన్ని కాదని అన్నారు.
యాక్సిడెంట్ తర్వాత తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి ఉండకపోవచ్చు అని.. అలాగే బరువు పెరగడంతో కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ వేగంగా పలకించలేకపోయానని తెలిపింది. నిర్మాత ఎంతగానో సపోర్ట్ చేశారని తెలిపింది.