
ఇండస్ట్రీలో ఇప్పుడు మరింత యాక్టివ్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. దేవర రిలీజ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ కావడంతో ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. దేవర కోసం నిశితంగా గమనిస్తున్న వారికి ఇంకో గుడ్‌న్యూస్ తెలిసింది... ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఇంకేం తెలిసింది.... చూసేద్దాం వచ్చేయండి...

జూనియర్ ఎన్టీఆర్ దేవర కీలక షెడ్యూల్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అక్కడే నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూట్ కూడా జరుగుతుంది. బాలయ్య, బాబీ సినిమా షూట్ రాజస్థాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో జరుగుతుంది.

ఇంకో రెండు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తయినట్టే. షూటింగ్‌కి తగ్గట్టు ట్రాక్స్ కూడా పంపేశారట అనిరుద్. అయితే జాన్వీ హెల్త్ డిస్టర్బ్ కావడంతో సాంగ్స్ షూటింగ్ పెండింగ్ పడింది. దేవర చిత్రీకరణకు బ్రేక్ వచ్చింది.

ఈ చిత్ర లేటెస్ట్ అప్‌డేట్స్ వింటుంటే ఫ్యాన్స్‌కు పూనకాలయితే ఖాయం. ఒకటి రెండూ కాదు.. పెద్ద ప్లానింగే చేస్తున్నారు వార్ 2 మేకర్స్. అవేంటో మీరు కూడా చూసేయండి మరి.

దేవరతో రప్ఫాడిస్తున్న ఎన్టీఆర్.. ఇప్పట్లో బ్రేక్ తీసుకునేలా కనిపించట్లేదు. దేవర ఇలా అయిందో లేదో అప్పుడే వార్ 2 అంటూ యుద్ధానికి వెళ్తున్నారు తారక్.