Khushi Kapoor: శ్రీదేవిని గుర్తుచేస్తోన్న జాన్వీ కపూర్ చెల్లెలు.. ఖుషి కపూర్ లేటేస్ట్ ఫోటోస్ చూశారా ?..
దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. హిందీ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక అక్క దారిలో చెల్లెలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ది ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ మనవడు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.