Janhvi Kapoor: బ్లాక్ శారీలో అందానికే అసూయ పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ.. జాన్వీ కపూర్ లేటేస్ట్ ఫోటోస్ వైరల్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో జాన్వీ ఒకరు. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది జాన్వీ. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. విభిన్న కంటెంట్ చిత్రాలు.. అంతకుమించి మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.