
జైలర్ సినిమాకు సీక్వెల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసిన మూవీ టీమ్, ఆ ఎనౌన్స్‌మెంట్ టీజర్‌లో రజనీకాంత్‌ను మాత్రమే చూపించారు. దీంతో పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్లు సీక్వెల్‌లో కనిపిస్తాయా.లేదంటే ముత్తువేల్ పాండియన్ క్యారెక్టర్‌ను మాత్రమే తీసుకొని కొత్త కథను డిజైన్ చేశారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

సీక్వెల్ విషయంలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు సీనియర్ నటి రమ్యకృష్ణ. రీసెంట్‌గా జైలర్ 2 సెట్లో అడుగు పెట్టిన ఈమె, మరోసారి ముత్తువేల్ పాండియన్ భార్యగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు నరసింహ సినిమా రిలీజ్ అయిన 26 ఏళ్లు పూర్తయిన రోజే ఈ సినిమా షూట్‌లో జాయిన్ అవ్వటం మరింత ఆనందంగా ఉందన్నారు.

కేవలం రమ్యకృష్ణ మాత్రమే కాదు తొలి భాగంలో రజనీకాంత్ కోడలి పాత్రలో నటించిన మిర్న మీనన్ కూడా సీక్వెల్‌లో కనిపించబోతున్నారు. అలాగే పార్ట్ 1లో నటించిన మరి కొందరు కూడా పార్ట్ 2లో కనిపించున్నారు.


ఇదిలా ఉంటె జైలర్ పార్ట్ 1 మ్యూజిక్ కి మంచి క్రేజ్ రావడంతో పార్ట్ 2లో కూడా అనిరుద్‌నే సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసారు. సినిమా ఎనౌన్స్‌మెంట్ టీజర్‌లో తలైవతో పాటు అనిరుద్, దర్శకుడు నెల్సన్ కూడా కనిపించారు .