
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యశ్రీ కూడా ఒకరు. ఈ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ప్రస్తుతం టీవీషోల్లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార.

జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పలు ఈవెంట్స్, సినిమాలలోనూ ఛాన్స్‌లు దక్కించుకుంటోంది సత్యశ్రీ. ఈ మధ్య కాలంలో పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గానూ నటించింది.

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సత్య చేసిన స్పెషల్ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.

ఇక టీవీషోస్, సినిమాలతో బిజీగా ఉంటోన్న సత్యశ్రీ తన సొంతూరులో కొత్త ఇల్లు కట్టుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో ఇంటిని కట్టుకుంది.

ఇటీవలే తన కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించింది సత్య శ్రీ. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పాలు పొంగించిన ఫోటోలు, బిందెతో నీటిని తీసుకెళ్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార

కాగా గృహ ప్రవేశ కార్యక్రమం సందర్భంగా పట్టు చీరలో బుట్ట బొమ్మలా మెరిసిపోయింది సత్య శ్రీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.