
ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. కొన్నిసార్లు అది మన మాట వింటుంది.. అప్పుడేం చేసినా చెల్లుతుంది. టైమ్ బాలేనపుడు అది చెప్పినట్లు మనం చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ శంకర్ మొదటిది చేసారు. ఇక ఇప్పుడు రెండోది చేయాల్సి వచ్చేలా ఉంది.

ఈ మధ్య ఈయనకు టైమ్ పెద్దగా కలిసిరావట్లేదనేది కాదనలేని చేదు నిజం. గేమ్ ఛేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా.. బడ్జెట్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బు నీళ్లలా ఖర్చు చేసారు.. షూట్ చేసింది చూపించలేదనే విమర్శలొచ్చాయి.

పైగా గేమ్ ఛేంజర్ ఫుటేజ్ 5 గంటలు అంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేసాయి. ఇంత పెద్ద దర్శకుడై అయ్యుండి.. ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా సినిమా ఎలా చేస్తారంటూ సెటైర్ల వర్షం కురిసింది.

ఈ ప్రభావం నెక్ట్స్ సినిమాలపై పడేలా కనిపిస్తుంది. చూస్తుంటే శంకర్ తర్వాతి సినిమా రావడానికి రెండు మూడేళ్ళు పట్టేలా ఉందిప్పుడు. ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. దినికి కారణం అయన రీసెంట్ డిజాస్టర్స్.

1000 కోట్లతో వీరయుగ నాయగన్ వేల్పరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా.. ఒకప్పటిలా శంకర్ కోసం అంత బడ్జెట్ ఇచ్చే నిర్మాతలు లేరిప్పుడు. ఎలా చూసుకున్నా.. ఈయనకు లాంగ్ గ్యాప్ అయితే తప్పేలా లేదిప్పుడు.