Rajamouli: మహేష్ కోసం రాజమౌళి మొదటిసారి అలాంటి రిస్క్‌లు తీసుకుంటున్నారా..?

| Edited By: Prudvi Battula

Feb 11, 2024 | 12:32 PM

మహేష్ బాబు కోసం రాజమౌళి మొదటిసారి అలాంటి రిస్క్‌లు తీసుకుంటున్నారా..? హీరోలను మార్చినా.. నిర్మాతలు మారినా.. టెక్నీషియన్స్ విషయంలో మాత్రం సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు దర్శక ధీరుడు. కానీ ఫస్ట్ టైమ్ మహేష్ కోసం పద్దతులు మార్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. SSMB 29 కోసం చాలా మార్పులు జరుగుతున్నాయి. మరి అవేంటో ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

1 / 5
కెరీర్‌కు భారీ బ్రేక్ వస్తుందని తెలుసు కాబట్టే గుంటూరు కారంలో ఫుల్ మాస్ రోల్ చేసారు మహేష్ బాబు. ఇందులో వింటేజ్ సూపర్ స్టార్‌ను చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్లుగా ఎంజాయ్ చేసారు. కొన్నేళ్లుగా ఏ సినిమాలో లేనట్లుగా ఇందులో డాన్సులు, ఫైట్లు ఉన్నాయి.. కామెడీ కూడా ఇరక్కొట్టారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నారీయన.

2 / 5
మహేష్ బాబు, రాజమౌళి సినిమా 2024లోనే సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం జక్కన్న మూవీ కోసమే మేకోవర్ అవుతున్నారు మహేష్. ఈ మధ్యే జర్మనీ వెళ్లిన ఈయన హైదరాబాద్‌కు వచ్చేసారు. ఎయిర్ పోర్టులో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోయింది. గుంటూరు కారం కంటే డబుల్ మాస్ లుక్‌లో కనిపించారు సూపర్ స్టార్.

3 / 5
రాజమౌళి కోసం మహేష్ ఇలా మారిపోతుంటే.. సూపర్ స్టార్ సినిమా కోసం జక్కన్న కూడా చాలా మార్పులు చేస్తున్నారు. తను రెగ్యులర్‌గా పనిచేసే టెక్నీషియన్స్ కాకుండా వేరే వాళ్లను ట్రై చేస్తున్నారు.

4 / 5
ఈ క్రమంలోనే ఆస్థాన సినిమాటోగ్రఫర్ సెంథిల్‌ను కాదని పిఎస్ వినోద్ వైపు వెళ్తున్నారు రాజమౌళి. ఇక విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా బాహుబలి, RRR ఫేమ్ శ్రీనివాస మోహన్ ప్లేస్‌లో బాహుబలి 2 ఫేమ్ కమల్ ఖన్ణన్ వస్తున్నారు.

5 / 5
ఎడిటర్‌గా శ్రీకర ప్రసాద్, ఆర్డ్ డైరెక్టర్‌గా సబు సిరిల్‌ కాకుండా వేరే టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లోకి రాబోతున్నారు. అడ్వంచరస్ డ్రామాగా SSMB29 రానుంది. మొత్తానికి తన సెంటిమెంట్ అనుకున్న టెక్నీషియన్స్‌తో కాకుండా.. వేరే వాళ్లతో మహేష్ సినిమా చేయబోతున్నారు జక్కన్న. అన్నట్లు ఈ సినిమా కోసం ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో పాటు అక్కడి నటీనటులు పని చేయబోతున్నారు.