
టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. స్రవంతి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు.

ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుబ్బరాజు, స్రవంతి లకు అభినందనలు తెలుపుతున్నారు.

సుబ్బరాజు, స్రవంతిల వివాహం అమెరికాలో సింపుల్ గా జరిగిందని తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

కాగా సుబ్బరాజు పెళ్లి చేసుకున్న స్రవంతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్లో డెంటిస్ట్గా పనిచేస్తోందట.

కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీ పట్టా పొందిన స్రవంతి ఒక ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా.

చాలా ఏళ్ల క్రితమే స్రవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడింది. కాగా సుబ్బరాజు పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ.. హైదరాబాద్‌లో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట.