Box Office: మ్యాచ్ పోయే.. వందల కోట్లు పోయే.. బాక్సాఫీస్ మునిగిపోయే..!

| Edited By: Prudvi Battula

Nov 22, 2023 | 8:58 AM

వ్రతం చెడ్డా ఫలితం దక్కుంటే బాగుండేది కానీ అదీ ఇదీ రెండూ దక్కలేదు. అదే ఇప్పుడు అందరి బాధ కూడా. మనోళ్లు వరల్డ్ కప్‌లో ఆడిన తీరు చూసి కచ్చితంగా ఆస్ట్రేలియాను తొక్కేస్తారు.. కప్పు పట్టేస్తారని కలలు కన్నారు. ఎక్కడో 2003 భయాలున్నా.. ఈసారి ఇండియన్ టీం ఉన్న ఫామ్ చూసాక.. ఆసీస్ అయినా తగ్గేదే లే అంటారేమో అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. 2003 సీన్ మళ్లీ రిపీట్ అయింది. ఆస్ట్రేలియా ఆరోసారి కప్పు ఎగరేసుకుపోయింది. మనింటికి వచ్చి.. మనోళ్లనే కొట్టి మరీ ప్రపంచ కప్పును తీసుకెళ్లింది. దాంతో కోట్లాది మంది అభిమానులు బాధలోంచి బయటికి రాలేకపోతున్నారు.

1 / 5
10 మ్యాచులు గెలిచి.. 11వ మ్యాచ్‌లో చేతులు ఎత్తేయడంతో అసలు ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా పక్కనబడితే ఈ మ్యాచ్ వల్ల నవంబర్ 19న ఇండియన్ బాక్సాఫీస్ దాదాపు 50 నుంచి 100 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. కచ్చితంగా మ్యాచ్ గెలుస్తున్నాం.. కప్పు కొడుతున్నాం అని అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. మరికొందరు బయట స్క్రీనింగ్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ చూసారు.. ఇంకొందరు క్లబ్బులకు వెళ్లారు.

2 / 5
అంతేకానీ ఒక్కరు కూడా థియేటర్స్ వైపు చూడలేదు. అందుకే దేశవ్యాప్తంగా నవంబర్ 19 ఆదివారమంతా సందడి లేకుండా పోయింది. ఈ మ్యాచ్ దెబ్బకు బాక్సాఫీస్ కళ తప్పింది అనేకంటే.. పూర్తిగా కుదేలైపోయిందనుకోవడం సబబేమో. అసలు సెలవు రోజు హిట్ టాక్ వచ్చిన సినిమాలను కూడా చూడ్డానికి ఆడియన్స్ రాలేదు. మరీ ముఖ్యంగా టైగర్ 3 సినిమాకు కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే మన దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మంగళవారం సినిమాది ఇదే పరిస్థితి.

3 / 5
ఇంకా చెప్పాలంటే జనాల్లేక షోస్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఇంతా చేసినందుకు మ్యాచ్ గెలిచుంటే బాగుండేదేమో..? కానీ అక్కడా మ్యాచూ పోయే.. ఇక్కడ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు పోయే అన్నట్లుంది పరిస్థితి. తెలుగు, తమిళం, హిందీ కలిపి దాదాపు 75 కోట్ల థియేట్రికల్ రెవిన్యూ నికరంగా నష్టపోయింది ఇండియన్ బాక్సాఫీస్.

4 / 5
పోనీ సెకండ్ షోలకు అయినా వెళ్తారేమో అనుకుంటే.. అప్పటికే ఓడిపోవడం ఖాయమని తెలిసాక ఎవరికీ సినిమా చూసే మూడ్ లేదు.. పైగా సెకండ్ షో టైమ్ కూడా అయిపోయింది. దాంతో ఎటు చూసుకున్నా ఓ రోజంతా మ్యాచ్‌కే సరిపోయింది. సరే అయిందేమో అయిపోయింది.. ఇకపై క్రికెట్ పండగ లేదు కాబట్టి సినిమాలు విడుదల చేసుకుందాం అని ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

5 / 5
ఈ క్రమంలోనే నవంబర్ 24న ఆదికేశవ విడుదల కానుంది.. డిసెంబర్ 1న యానిమల్‌తో పాటు సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర రానుంది. ఇక డిసెంబర్ 7న హాయ్ నాన్న, 8న నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ విడుదల కానున్నాయి. డిసెంబర్ 22న డైనోసర్ సలార్ వస్తుంటే.. అదేరోజు షారుక్ ఖాన్ డంకీ కూడా విడుదల కానుంది.