
అల్లు అర్జున్ అంటేనే డాన్సులు.. ఆయన పేరు మీదే ఎన్నో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అలాంటి హీరో సినిమాలో డాన్సుల్లేవనేది కొన్నేళ్లుగా అభిమానుల నుంచి వస్తున్న కంప్లైంట్. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. మరి ఈ కంప్లైంట్‌ని బన్నీ ఎలా తీసుకుంటున్నారు..?

పుష్ప 2లో లెక్కలు సరి చేస్తారా..? అసలు అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి..? తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అల్లు అర్జున్ పేరు ముందు వరసలో ఉంటుంది. ప్రతీ సినిమాలోనూ ఒళ్లు హూనం చేసుకుంటూ స్టెప్పులేస్తుంటారు బన్నీ.

కానీ డిజే నుంచి ఈయన శైలి మారింది. స్టైలిష్‌గా స్టెప్స్ వేస్తున్నారు కానీ ఒకప్పట్లా ఫ్లోర్ మూవెంట్స్‌కు దూరంగా ఉన్నారు బన్నీ. అల వైకుంఠపురములో, పుష్పలోనూ అదే కంటిన్యూ చేసారీయన. కంటెంట్‌పై ఫోకస్‌తో డాన్సుల్ని పక్కన పెట్టేసారు బన్నీ.

బీట్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నా.. గ్రేస్‌తోనే వాటిని కవర్ చేస్తున్నారు అల్లు అర్జున్. కానీ పుష్ప 2తో అన్ని లెక్కలు ఒకేసారి తీర్చేస్తానంటున్నారీయన. మునపటి ఊపు తీసుకొచ్చేలా కొరియోగ్రఫర్స్‌కు తన వైపు నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి.

అంతేకాదు.. ఫస్ట్ పార్ట్‌లో మిస్ అయిన ప్రతీ విషయంపై సీక్వెల్‌లో ఫోకస్ చేస్తున్నారు బన్నీ. పుష్ప 2లో డాన్సులపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్యే ముగిసిన ఓ షెడ్యూల్‌లో బాలీవుడ్ కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫరీలో జాతర గెటప్స్‌తో దాదాపు 400 మంది జూనియర్లు, 100 మంది పైగా డాన్సర్లతో షూట్ చేసారు.

పుష్ప 2లో బన్నీ డాన్స్ జాతర మామూలుగా ఉండదని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా జాతర డాన్స్ సూపర్ అంటున్నారు. కొన్ని రోజులుగా RFCలోనే పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. అక్కడే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్.

అల్లు అర్జున్ కూడా అభిమానులకు ఏమేం కావాలో అన్నీ లెక్కలేసుకుని మరీ పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో 1000 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు బన్నీ. చూడాలిక.. ఏం జరగబోతుందో..? ఆగస్ట్ 15న విడుదల కానుంది ఈ చిత్రం.