
దక్షిణాది ముద్దుగుమ్మ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక గత కొంతకాలంగా సైలెంట్ అయ్యింది. దీనిపై వివరణ ఇస్తూ తాజా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

‘అందరూ క్షమించాలి. కొన్ని రోజులుగా మిమ్మల్ని మిస్సవుతూ వచ్చాను. ఎందుకంటే నెట్‌వర్క్ లేని ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాను’’ అని రష్మికా మందన్నా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

ఇంతకీ సంగతేమంటే.. రష్మిక, దేవ్ మోహన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘రెయిన్ బో’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై శాంతరూబన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ మువీ షూటింగ్ కొన్నాళ్లు నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా తాజాగా పూర్తైంది. దీంతో నెట్‌వర్క్ ఉన్న ప్రాంతానికి రావడంతో రష్మిక తన లేటెస్ట్ పోస్టులో పై విధంగా పోస్టు పెట్టారు

చెన్నైలో కొన్ని రోజులు ‘రెయిన్ బో’ షూటింగ్ చేశాం. ఆ తర్వాత కొడైకెనాల్ వెళ్లాం. అక్కడ షూటింగ్ పూర్తైన తర్వాత వెళ్లిన మూడో ప్రదేశం మున్నార్. ఈ రెండు ప్రాంతాల్లోనూ నెట్‌వర్క్ లేదు. కానీ కొడైకెనాల్, మున్నార్‌లలోని అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉల్లాసంగా అనిపించిందని చెప్పుకొచ్చారు.