
సౌత్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాల కంటే ఇప్పుడు ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడియన్స్. భయపడతామని తెలిసి కూడా థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నారు. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ సినిమా చూడండి.

అదే ది ఎక్సార్సిస్ట్. ఇది1973లో వచ్చిన అమెరికన్ హాలీవుడ్ సినిమా. దర్శకుడు విలియం ఫ్రైడ్కిన్ దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం .70ల నాటి ఈ చిత్రం ఇప్పటికీ నంబర్ 1 థ్రిల్లర్ చిత్రం ఇదే.

విలియం పీటర్ బ్లాటీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కొత్త ఇంటికి మారిన ఓ కుటుంబానికి అక్కడ ఎదురైన పరిస్థితులు.. ఆ ఇంట్లో ఓ పిల్లవాడు వింతగా మారడం అతడి తల్లి గమనిస్తుంది.

ఆ చిన్నారి పరిస్థితి రోజురోజుకు మారిపోవడం, మనిషి రూపురేఖలకు భిన్నంగా మారడం గమనించిన తల్లి ఓ క్రైస్తవ మతగురువును సంప్రదించడంతో ఆ చిన్నారికి పట్టిన దెయ్యం గురించి తెలుస్తుంది. ది ఎక్సార్సిస్ట్ అనేది చాలా భయానక థ్రిల్లర్ మూవీ.

ఒక తల్లి తన బిడ్డను దెయ్యం నుండి రక్షించుకోవడానికి చేసే పోరాటామే ఈ మూవీ. ఈ చిత్రం ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమా తదుపరి భాగం ది ఎక్సార్సిస్ట్ బిలీవర్, 2022లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.