5 / 5
దీపావళికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ తెచ్చుకున్న మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఓ అబ్బాయికి తల్లిగా నటించి మెప్పించారు. కథలో దమ్ముంటే హీరోయిన్‌కి పిల్లలున్నా.. లేకున్నా.. ఆడియన్స్ దగ్గర మైనస్ మార్కులేం పడవు. పైపెచ్చు.. మంచి పెర్ఫార్మర్ అనే పేరుతో దూసుకుపోవచ్చనే ధీమాతో ఈ తరహా రోల్స్ కి ఓకే చెప్పేస్తున్నారు మన నాయికలు.