
బాలీవుడ్‌లోని అత్యంత అద్భుతమైన నటీమణులలో ఊర్వశి రౌతేలా ఒకరు. తన ప్రతి సినిమా ఈవెంట్లలో.. లేదా అవార్డ్స్ వేడుకలలో తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశాన్ని ఎప్పుడూ వదలదు.

ఆమె అద్భుతమైన ఎయిర్‌పోర్ట్ లుక్స్ అయినా లేదా సిజ్లింగ్ హాట్ రెడ్ కార్పెట్ అవుట్‌ఫిట్‌లైనా సరే, గ్లామ్ ఫ్యాషన్ కోటియన్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఊర్వశి 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్‌పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది.

ఇటు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి టాలీవుడ్ అడియన్స్ కు దగ్గరయ్యింది. బాలకృష్ణ లేటెస్ట్ సినిమా ఎన్‌బీకే 109 లో పార్టీ బ్యూటీ ఊర్వశి రౌతెలాకు ఓటేసారు మేకర్స్.

మెగాస్టార్‌తో కాలు కదిపినా, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో స్పెషల్‌గా యాక్ట్ చేస్తున్నా ఆమెకు కలిసొస్తున్న విషయం అదే. స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశికి దాదాపు 2 నుంచి 3 కోట్లవరకు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.

మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు వీడియోలకు యమా క్రేజ్ ఉంది.

హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. ఈ అమ్మడు వయ్యారాలు ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు.