
బాక్ పేరుతో తెలుగులో విడుదలవుతోంది ఈ సినిమా. సత్యభామ, బాక్ ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయినా వీరిద్దరి నెక్స్ట ప్రాజెక్టుల మీద ఆ నష్టం భారీగా ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. కెరీర్ మళ్లీ వెలగాలంటే ఈ సినిమాల సక్సెస్ కంపల్సరీ అంటున్నారు క్రిటిక్స్.

18 ఏళ్ళ కెరీర్‌లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కనబెట్టేస్తున్నారు తమన్నా.. కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్‌లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్సైపోయారు.

డబ్బు కోసమో, పేరు కోసమో సినిమా ఇండస్ట్రీకి వస్తే కొంత కాలం మాత్రమే ప్రయాణం చేయగలమని అన్నారు నటి తమన్నా. అదే కళ కోసం వచ్చిన నటీనటులు మాత్రం సుదీర్ఘమైన ప్రయాణం చేస్తారని చెప్పారు. సినిమా సినిమాకీ ప్రేక్షకులకు వైవిధ్యం చూపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు తమన్నా.

ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్.. లిప్ లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు. కానీ కెరీర్ చివరికి వచ్చేస్తున్నపుడు రూల్స్ పెట్టుకుంటే.. ఛాన్సులు రావని అన్నీ పక్కనబెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ.

ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా.. సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్. గతేడాది వచ్చిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్‌లే దీనికి నిదర్శనం. అందులో గ్లామర్ షోతో ఆపలేదు తమన్నా.. ఏకంగా ఇంటిమేట్ సీన్స్ కూడా చేసారు.

ఇక హాట్ ఫోటోషూట్స్‌కు అయితే లెక్కే లేదు.. వారానికి రెండు కొత్త ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతున్నారు. కెరీర్ చరమాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవ్వదని తమన్నాకు కూడా తెలుసు.

అందుకే సినిమాలు వచ్చినా రాకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. డిజిటల్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం మూడు వెబ్ సిరీస్‌లతో పాటు.. వేదా, స్త్రీ 2, ఓదెల 2 సినిమాల్లోనూ నటిస్తున్నారు తమన్నా.