ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.