
కోలీవుడ్ నుంచి వచ్చిన విజయ్ గోట్ మూవీ ఆఫర్‌నీ వద్దనుకున్నారు శ్రీలీల. ఇప్పుడు తెలుగులో ఆమెకుసెట్స్ మీద పవర్‌స్టార్ సినిమా ఉంది. రవితేజ 75 కూడా యాడ్ అయితే.. మళ్లీ ఈ లేడీ ఒకరకంగా ఫామ్‌లోకి వచ్చినట్టే అనుకోవాలి.

ఇప్పుడు సరిగ్గా ఇలాంటిదే జరిగింది శ్రీలీల కెరీర్‌లో. అద్భుతమైన అవకాశం తలుపు తడితే, సారీ అంటూ సింపుల్‌గా చెప్పేశారట శ్రీలీల. గట్సీ గర్ల్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు జనాలు.

చూశారుగా అదీ సంగతి.. అటు హీరో ఎవరైనా సరే, ఇటు పాట ఏం ఉన్నా సరే... బంగారంలాంటి స్టెప్పులేసి అందరి చేతా విజిల్ వేయించేస్తారనే పేరుంది శ్రీలీలకు. అందుకే ఆమెకు స్టోరీ నెరేట్ చేసేటప్పుడే పాటలు, వాటికున్న స్టెప్పులు గురించీ ముందే హింట్ ఇచ్చేస్తున్నారు మనవాళ్లు.

రీసెంట్‌గా మహేష్‌తోనూ దుమ్మురేపే స్టెప్పులు వేయించేసి ప్రశంసలు అందుకున్నారు ఈ బ్యూటీ. ఇవన్నీ చూశాక తమిళ తంబిలు ఊరుకుంటారా? వెల్కమ్ ప్లీజ్ అని ఆహ్వానం పలుకుతున్నారు.

విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులు వేయమని శ్రీలలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ అయామ్ సారీ అని చెప్పేశారట మిస్ లీల. తెలుగులో రిపీటెడ్ కాంబినేషన్స్ లో చాలా సినిమాలున్నాయి.

కాల్షీటు సర్దడం కుదరదని చెప్పారని కోలీవుడ్ న్యూస్. అయితే, ఇన్‌సైడ్ సోర్స్ మాత్రం మరోలా ఉంది. తమిళ్‌లో ఫస్ట్ సినిమా ఛాన్స్ విజయ్‌తో అనగానే హ్యాపీగా అనిపించిందట శ్రీలీలకి. అంతో, ఇంతో కేరక్టర్ కూడా ఉంటే కచ్చితంగా ఒప్పుకునేవారట.

జస్ట్ స్పెషల్ సాంగ్ అని మేకర్స్ తెగేసి చెప్పడంతో.. మరీ ఫస్ట్ సినిమాతో ఐటమ్ గర్ల్ అనే ముద్ర ఎందుకుని అనుకున్నారట. ఆ విషయాన్ని వాళ్లకి డైరక్ట్ గా చెప్పకుండా కాల్షీటు కుదరట్లేదని సున్నితంగా చెప్పారని సమాచారం.