
సింగిల్ పసంగ.. అనే పాట ఆ మధ్య తమిళ్‌లో చాలా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు దీని ఫీమేల్ వెర్షన్‌ని ట్రై చేస్తున్నారు శ్రుతి హాసన్. బేసిగ్గా మ్యూజిక్ డైరక్టర్ కాబట్టి, ఆ మాత్రం క్రియేటివిటీని చూపించడంలో తప్పేం లేదులే అనుకునేరు.. ఇక్కడ మాట్లాడుకుంటున్నది జస్ట్ ప్రొఫెషనల్ విషయం కాదు... అంతకు మించిన పర్సనల్ ఇష్యూ.. సింగిల్.. మింగిల్.. స్టేటస్‌ల గురించి చూసేద్దాం..

శ్రుతిహాసన్ ఇప్పుడు సింగిల్‌గా ఉన్నారా? నిజంగానే శాంతనుతో బ్రేకప్ అయిందా? లేకుంటే ఇద్దరూ మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారా?.. ఇక ఇలాంటి ప్రశ్నలకు అసలు ఆస్కారమే లేదు..

మీకెందుకు అన్ని అనుమానాలు అంటూ ఉన్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు మేడమ్ శ్రుతి. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు శ్రుతిహాసన్.

బోయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో ఇటీవల ఆమె విడిపోయారు. ఈ విషయాన్నే లేటెస్ట్ గా స్పష్టం చేశారు శ్రుతి. వర్క్ నీ, లైఫ్‌నీ బ్యాలన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మింగిల్ కావడానికి తానెప్పుడూ రెడీగానే ఉన్నానని చెప్పారు. కాకపోతే.. షరతులు వర్తిస్తాయి అని చెబుతున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికి శ్రుతిహాసన్ ఫుల్ ఫోకస్ పూర్తిగా కెరీర్ మీదే ఉందట.

సినిమాలతో, సంగీతంతో మింగిల్ కావడానికే ప్రస్తుతం తన మనసు ఇష్టపడుతోందట. 2023లాంటి సక్సెస్‌ఫుల్ ఇయర్‌ని రీక్రియేట్ చేయడానికి కృషి చేస్తున్నానని అంటున్నారు మిస్ హాసన్.

బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిన ప్రతి సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోతుంటే వచ్చే పాజిటివ్ వైబ్‌ని ఎవరైనా.. కెరీర్‌లో ఒక్కసారైనా ఆస్వాదించి తీరాల్సిందే అని ఊరిస్తున్నారు హాసన్ డాటర్.