
కొంతమంది హీరోయిన్లను ఒక ఇండస్ట్రీకి పరిమితం చేయలేము. సాయి పల్లవి కూడా అదే కోవలోకి వస్తుంది. చేసింది తక్కువ సినిమాలైనా సౌత్ లో ఈమె ఫాలోయింగ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. ఈమె కనిపించినా.. పేరు వినిపించినా అభిమానుల గోల మామూలుగా ఉండదు. అలాంటి సాయి పల్లవి కొన్ని నెలలుగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

దాదాపు ఏడాది బ్రేక్ తర్వాత ఈ మధ్య శివ కార్తికేయన్ సినిమా ఒప్పుకున్నారు సాయి పల్లవి. దీంతోపాటు తెలుగులో నాగచైతన్య, చందు మొండేటి సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈమెకు బాలీవుడ్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది.

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా వస్తున్న డెబ్యూ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అమీర్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన సునీల్ పాండే దీనికి దర్శకుడు. కథ నచ్చడంతో సాయి పల్లవి ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

కథ నచ్చితే ఏ భాషలో అయినా నటించడానికి తనకు ఇబ్బంది లేదని ఇదివరకే చెప్పారు సాయి పల్లవి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ సైన్ చేశారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే సాయి పల్లవి బాలీవుడ్ కెరీర్ కు గట్టి పునాది పడినట్టే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మరి సౌత్ లో మాయ చేసిన సాయి పల్లవి.. నార్త్ లో ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.