
'వాడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా' అనే రావు రమేష్ డైలాగు తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా బాగా గుర్తుంటుంది. అయితే ఈ డైలాగ్‌కి పూర్తి వ్యతిరేకంగా ఓ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు రష్మిక మందన్న. దయచేసి అతన్ని అలాగే వదిలేయండి.!

కలుషితం చేయకండి అని అంటున్నారు. ఇంతకీ నేషనల్ క్రష్ రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరి గురించో అర్థమైందా? యస్... కల్ట్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి. ''జనాలకు ఏదో చెప్పి ప్లీజ్ చేసి, కన్విన్స్ చేయాలని అనుకోరు సందీప్. ఆయన ఏం చెప్పాలనుకుంటే అదే చెబుతారు.

తను నమ్మిన దాని మీద నిలబడతారు. జనాల కోసం మారరు. నాకు సందీప్ రెడ్డి వంగాలో అదే నచ్చుతుంది. ఆయన అలాగే ఉండాలి'' అని అంటున్నారు రష్మిక. అంతే కాదు, యానిమల్ సీక్వెల్ గురించి సందీప్ ఆమెతో పంచుకున్న కొన్ని పాయింట్స్ విని, ఆశ్చర్యపోయారట రష్మిక.

దాని గురించి చెబుతూ ''నాతో సందీప్ షేర్ చేసుకున్న విషయాలు ఇంకా బేబీ స్టేజ్‌లోనే ఉన్నాయి. అయినా ఆ ఆలోచనలు వింటుంటే నాకు మైండ్ బ్లాంక్ అయింది. అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయా? అనిపించింది.

మనం పార్ట్ 2తో బ్లాస్ట్ చేస్తామని సందీప్ కాన్ఫిడెంట్‌గా చెప్పిన క్షణాలను మర్చిపోలేను. ప్రస్తుతం ఆయన స్పిరిట్ పనులతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాతే యానిమల్ పార్క్ గురించి పూర్తిగా ఆలోచిస్తారు'' అని అన్నారు రష్మిక.

పుష్ప2 టీమ్ గురించి కూడా అలాంటి అభిప్రాయాలనే పంచుకున్నారు నేషనల్ క్రష్. ''ఇటీవల పుష్ప2 సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్నా. అసలు సెట్లో కొన్ని కొన్ని ఐడియాలను చూసినప్పుడు నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. అసలు ఇంత వైవిధ్యంగా ఎలా ఆలోచిస్తారా? అని ఆశ్చర్యపోయాను.

నటిగా గత ఒకటీ, రెండేళ్లల్లో నేను కూడా చాలా ఎదిగాను. ఆ పరిపక్వత ఇప్పుడు పుష్ప2కి ఉపయోగపడుతోంది. శ్రీవల్లి కేరక్టర్‌ని సెకండ్ పార్టులో మరింత చాలెంజింగ్‌గా తీసుకుని చేశా. నేను, నా టీమే కాదు, చూసిన ప్రతి ఒక్కరూ సినిమాను నెక్స్ట్ రేంజ్‌లో నిలబెడుతారు.

పుష్ప2 సినిమా కథ నాకు ఇంట్రస్టింగ్ గేమ్‌లాగా అనిపిస్తోంది. గేమ్‌లో ఆడేకొద్దీ ఆడాలనిపించినట్టు, ఈసెట్లో షూటింగ్ చేసేకొద్దీ చేయాలనిపిస్తోంది'' అని అన్నారు. ధనుష్‌కి జోడీగా శేఖర్ కమ్ముల సినిమాలోనూ నటిస్తున్నారు రష్మిక మందన్న.

ధనుష్‌లాంటి యాక్టర్‌తో సెట్స్ లో పనిచేసినప్పుడు, నటిగా తాను ఎదగగలుగుతానని అన్నారు. త్వరలోనే శేఖర్ కమ్ముల సెట్స్ కి వెళ్లనున్నారు రష్మిక మందన్న.