Rashmika Mandanna: కెరీర్‌లో గ్యాప్ తీసుకుంటున్నారా.? క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్.
అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయని అసలు అర్థం కాదు. దేని కోసం పరుగులాటో తెలియదు. కానీ అంతా జరుగుతున్న క్రమంలో ఎక్కడో ఒక్క క్షణం ఏం జరుగుతుందో చెప్పేవాళ్లుండాలి. పరుగు ఆపడం ఓ కళ. మంచి స్పీడ్ మీదున్నప్పుడు, కాస్త ఆగు.. కాస్త ఏం జరుగుతుందో ఆలోచించు.. ఎంత దూరం వచ్చావో గమనించు అని చెప్పేవాళ్లు చాలా ముఖ్యం. అలాంటి వాళ్లు తనతో ఉన్నారనే అంటున్నారు రష్మిక. ఇంతకీ ఎవరు వారు.? ఇది కదా నేను కన్న కల అని అంటున్నారు రష్మిక.