Rajeev Rayala | Edited By: Ravi Kiran
Feb 01, 2022 | 9:17 AM
ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ రాశిఖన్నా. ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో అమ్మడికి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న రాశి ఖన్నా ఇప్పుడు ఓ కొత్త రంగంలోకి అడుగుపెట్టిందని తెలుస్తుంది.
రాశి ఖన్నా తాను యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొంది. తన మేకప్ మరియు ఫుడ్ నుండి మొదలుకుని ప్రతి ఒక్క విషయం గురించి యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది
హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా తన టీమ్ వీడియో లను షేర్ చేస్తారంటూ చెప్పుకొచ్చింది. యూట్యూబ్ ద్వారా మరింతగా తన అభిమానులకు చేరువ అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి థ్యాంక్యూ సినిమాలో నటిస్తుంది. తమిళంలో కూడా రెండు సినిమాలను ఈ అమ్మడు చేస్తుంది.
మరో వైపు ఈ అమ్మడికి వెబ్ కంటెంట్ లో కూడా ఛాన్స్ వస్తున్నాయట. కాని ఇప్పటి వరకు అధికారికంగా ఈ అమ్మడు ఓకే చెప్పలేదు.