
సినిమా ఇండస్ట్రీలో అంతే. ఇక్కడ ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం.. ఊహించడం అంతకంటే కష్టం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా.. అనుకుకుండా తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సక్సెస్ అయింది ఓ బ్యూటీ.

Priyanka Mohan Photo

మరోవైపు ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. నాలుగేళ్ల కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారంలో నటించారు ప్రియాంక. ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు.

గ్లామర్ షోకు దూరంగా ఉన్నా.. ప్రియాంక అప్పియరెన్స్ గురించి మాత్రం చర్చ బాగానే జరిగింది. కానీ ఫ్లాపులున్నపుడు మనోళ్లు పెద్దగా ఆసక్తి చూపించరు కాబట్టి టాలెంట్ ఉన్నా ఆఫర్స్ మాత్రం రాలేదు ఈ భామకు. దాంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి.. డాన్, డాక్టర్, ఈటీ లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు.

Priyanka Mohan Look

OG సెట్స్‌పై ఉండగానే నానితో సరిపోదా శనివారంలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. ఈ చిత్ర షూటింగ్ కూడా ఈ మధ్యే మొదలైంది. గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. తమిళంలోనూ ఈమె బిజీగానే ఉంది ప్రియాంక. ధనుష్ పాన్ ఇండియన్ సినిమా కెప్టెన్ మిల్లర్‌లోనూ ప్రియాంక మోహనే హీరోయిన్.

జయం రవితోనూ బ్రదర్ సినిమాలో నటిస్తున్నారు ప్రియాంక. తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా ఖరారైనట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒకేసారి మూడు క్రేజీ ఆఫర్స్‌తో ప్రియాంక టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయారు. ఇవన్నీ కానీ హిట్ అయ్యాయంటే.. ప్రియాంక మోహన్ రేంజ్ మారిపోవడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో..?