
సౌత్ సినిమాలో పాపులర్ అయిన ప్రియమణి, సెకండ్ ఇన్సింగ్స్‌లో డిజిటల్ స్టార్‌గా దూసుకుపోతున్నారు. ఓటీటీలో లీడ్ రోల్స్‌లో నటిస్తూ బాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు.

అయితే నార్త్‌లో రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటున్నా.. నార్త్ స్టార్స్ ఫాలో అయ్యే కొన్ని పబ్లిసిటీ స్ట్రాటజీస్ విషయంలో మాత్రం హాట్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. నటిగా మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ప్రియమణి.

పెళ్లికి ముందు పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేసిన ప్రియమణి.. నటిగా, గ్లామర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే రీ ఎంట్రీలో మాత్రం ఓటీటీల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో చేసిన క్యారెక్టర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఫామ్‌లోకి వచ్చారు ప్రియమణి. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

డిజిటల్ ప్రాజెక్ట్స్‌తో పాటు నార్త్ సినిమాల్లోనూ రెగ్యులర్‌గా నటిస్తున్నారు ప్రియమణి. తాజాగా తన బాలీవుడ్ జర్నీ గురించి మాట్లాడిన ప్రియమణి, అక్కడి పపరాజీ కల్చర్ మీద హాట్ కామెంట్స్ చేశారు.

రీసెంట్ టైమ్స్‌లో స్టార్స్ ఎయిర్‌పోర్ట్, జిమ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్ ట్రెండ్ అవ్వటంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ.

బాలీవుడ్ తారలు ఫోటో, వీడియోగ్రాఫర్స్‌కు డబ్బులిచ్చి ఎయిర్‌పోర్ట్, జిమ్ వీడియోలు, ఫోటోలు వైరల్ చేయిస్తున్నారని చెప్పారు. జవాన్ సినిమా రిలీజ్ టైమ్‌లో తనకు కూడా అలాంటి ప్రపోజల్ వచ్చిందంటూ అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు.