
ఏం పిల్లో ఏపిల్లడో సినిమాతో టాలీవుడ్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత. ఈ అమ్మడు ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. తర్వాత సిద్ధార్థ్ బావా సినిమాలో ఆఫర్ కొట్టేసి ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

బావా సినిమాలో పల్లె టూరి అమ్మాయిలా కనిపించి తన నటన, అందంతో వావ్ అనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, అత్తారింటికి దారేది మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దీని తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

అయితే ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. తర్వాత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.

ఇక తల్లైన తర్వాత ఈ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గలేదు. తన గ్లామర్‌తో ఇప్పటికీ కుర్రకారును అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. సిమాలకు దూరమైనా, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో సందడి చేస్తుంటది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందాలతో మత్తెక్కించింది. ఏకంగా చూయింగ్ గమ్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడు చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.