
అనూహ్యంగా ఏదైనా కాన్సెప్ట్ హిట్ అయితే, వెంటనే ఆ జోనర్‌లో పొలోమంటూ పది సినిమాలు క్యూలో ఉంటాయంటారు. రీసెంట్‌గా స్త్రీ2 సక్సెస్ కాగానే అందరూ ఈ విషయం గురించే డిస్కస్ చేసుకున్నారు.

దానికి తగ్గట్టుగానే అనౌన్స్ మెంట్ల పరంపర కూడా స్ట్రాంగ్ గానే ఉంది మరి. స్త్రీ2 కలెక్షన్లు చూసి కళ్లు తిరిగాయి బాక్సాఫీస్ పండిట్స్ కి. ఇవేం కలెక్షన్లురా బాబూ.. ఓ హారర్ సినిమాకు ఆడియన్స్ ఇంతలా కనెక్ట్ అవుతారా అనుకున్నారు.

స్త్రీ సినిమాకున్న చరిష్మా అలాంటిది మరి. ఆ క్రేజ్‌తో ఈ సినిమా మరింత జోరుగా కొట్టుకొచ్చేసింది అని విశ్లేషించిన వారూ లేకపోలేదు. వాళ్లు ఏమనుకుంటే ఏంటి.. జనాల ఆదరణ పొందే జోనర్లను మనం ఎందుకు మిస్ చేసుకోవాలి.

మనం కూడా ఆ రూట్లోనే ఓ సారి ట్రావెల్ చేసొస్తే పోతుందిగా అనుకుంటున్నారు వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్ మేకర్స్. రష్మిక కీ రోల్ చేస్తున్న ఈ సినిమా కూడా హారర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.

హంపి నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు ఇప్పుడు నార్త్ లో మంచి బజ్ ఉంది. అసలే యానిమల్ సక్సెస్ మీదున్న రష్మిక ఇప్పుడు హారర్ సినిమాలో ఎలా మెప్పిస్తారో చూడాలన్నది వారి ఇంట్రస్ట్.

నార్త్ లో రష్మిక మందడుగేస్తే, సౌత్‌లో ఓ హిట్ ఫ్రాంఛైజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మిస్ పూజా హెగ్డే. రాఘవ లారెన్స్ కెరీర్‌లో కాంచన సీరీస్ ఎంత పెద్ద హిట్టో స్పెషల్‌గా పరిచయం చేయక్కర్లేదు.

ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంఛైజీలో ఫోర్త్ చాప్టర్‌కి సైన్ చేశారట పూజా. సౌత్‌లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ట్రై చేస్తున్న పూజా హెగ్డే కి కాంచన పర్ఫెక్ట్ మూవీ అంటున్నారు క్రిటిక్స్.

ఆల్రెడీ సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు మేడమ్ పూజా. కమ్‌బ్యాక్‌లో కోలీవుడ్ మీదే ఈ బ్యూటీ ఫోకస్ ఎక్కువగా ఉందన్నది మరికొందరి అబ్జర్వేషన్. ఏదేమైనా హారర్‌తో లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు రష్మిక అండ్ పూజా.